జియ్యమ్మవలస. ఫిబ్రవరి 23:- పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అలాగే జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు సోమవారం జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనజ గ్రామంలో దోమల నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా గ్రామంలో ఏసీఎం మందును వైద్య సిబ్బంది పిచికారీ చేశారు. ఆర్నడ సచివాలయం పరిధిలోని వనజ గ్రామంలోని ప్రతి ఇంటినీ వైద్య బృందం సందర్శించింది. మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్తగా ఈ పిచికారీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ స్కూల్ఆవరణలో కూడా ఏసీఎం మందును ప్రత్యేకంగా పిచికారీ చేయించారు.జియ్యమ్మవలస పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ సాయి ప్రసన్న, డాక్టర్ జగదీష్ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమం జరిగిందన్నారు అలాగే వర్షాకాలం అలాగే సీజనల్ మార్పుల వల్ల దోమల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చు. ఈ కార్యక్రమంలో, ఎం టి ఎస్, హెచ్ ఏ, ఎం ఎల్ హెచ్ పి, సిబ్బందితో పాటు ఏ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు సిహెచ్ డబల్, మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైద్య బృందం అంతా సమన్వయంతో పనిచేస్తూ గ్రామంలోని ప్రతి గల్లీ, ప్రతి మూలనా మందు పిచికారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.