మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర కు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్సీ

గద్వాల జిల్లా, మన జైత్రయాత్ర డిసెంబర్ 5:- జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలో తిమ్మప్ప స్వామి జాతర — బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ.ఆదిశిల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మల్దకల్ (పూర్వంలో మొదల్‌కల్‌గా పిలువబడేది)లో జరగనున్న శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప స్వామి) జాతర సందర్భంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అంచనా నేపథ్యంలో, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వయంగా జాతర స్థలాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అయోమయం లేకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా పటిష్టమైన బందోబస్తు అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పార్కింగ్ ఏర్పాటు విషయంలో అయిజ వైపు నుంచి వచ్చే వాహనాలకు కేజీవీబీ పాఠశాల పక్కన, గద్వాల వైపు నుంచి వచ్చే వాహనాలకు పీఎచ్‌సీ సెంటర్ వద్ద, ఎలుకూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ట్రినిటీ స్కూల్ వద్ద, మద్దెలబండ నుంచి వచ్చే వాహనాలకు మల్లకల్ ఎంట్రెన్స్ వద్ద — మొత్తం నాలుగు దిశల్లో నాలుగు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. దేవాలయానికి వెళ్లే మార్గాలు, క్యూ లైన్ బారికేడ్లు, ఎంట్రీ–ఎగ్జిట్ ద్వారాలు, ప్రముఖుల ప్రవేశ మార్గాలు వంటి అంశాల్లో సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరమైన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పాటు రెండు షిఫ్టులుగా భారీ బందోబస్తు మోహరించిన నేపథ్యంలో ప్రతి పోలీసు సిబ్బంది తాము కేటాయించిన ప్రదేశాల్లో పూర్తిగా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే రథోత్సవం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఆకతాయిలను అణచివేసేందుకు షీ టీమ్‌లను మఫ్టీలో ఫుట్ పెట్రోలింగ్‌లో ఉంచాలని, అలాగే పిక్ ప్యాకెటర్లు వంటి నేరస్తుల పట్ల సీసీఎస్ టీమ్‌లు కూడా మఫ్టీలో అలర్ట్‌గా మోహరించాల్సిందిగా సూచించారు. భక్తులకు తాగునీరు, దారి చూపే సూచికలు, అత్యవసర సేవలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రతి భక్తుడు ప్రశాంతంగా, భద్రతతో స్వామి వారిని దర్శించుకోవడానికి సమగ్ర ప్రణాళికతో కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేస్తున్నాము” అని తెలిపారు. అనంతరం స్వామి వారిని జిల్లా ఎస్పీ దర్శించుకోవడం జరిగింది. కార్యక్రమంలో గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, శాంతినగర్ సీఐ టాటా బాబు, మల్దకల్ ఎస్సై నందికర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మై టిడిపి యాప్ గురించి అవగాహన కార్యక్రమం .

    మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యం జరిగిన కార్యక్రమం. బంగారు పాల్యం, మన జైత్రయాత్ర, ఫిబ్రవరి 23 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి గురించి అవగాహన కార్యక్రమం మండల…

    Hello world!

    Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వనజ గ్రామంలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు

    • By RAMESH
    • February 24, 2026
    • 5 views
    వనజ గ్రామంలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు

    మై టిడిపి యాప్ గురించి అవగాహన కార్యక్రమం .

    మై టిడిపి యాప్ గురించి అవగాహన కార్యక్రమం .

    పుష్ప 2: ది రూల్’కు ఏడాది పూర్తి…అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

    పుష్ప 2: ది రూల్’కు ఏడాది పూర్తి…అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

    మహాపరినిర్వాణ దినోత్సవం: ఇంకా ప్రయాణంలోనే అంబేద్కర్ సమానత్వ భారతం

    మహాపరినిర్వాణ దినోత్సవం: ఇంకా ప్రయాణంలోనే అంబేద్కర్ సమానత్వ భారతం

    అంగరంగా వైభవంగా … తిమ్మప్ప స్వామి వారి రథోత్సవం

    అంగరంగా వైభవంగా … తిమ్మప్ప స్వామి వారి రథోత్సవం

    మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర కు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్సీ

    మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర కు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్సీ