రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి ,శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప ) స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా, మన జైత్రయాత్ర డిసెంబర్ 5 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి‌ వారి బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దేవాలయం లో స్వామి వారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి తిమ్మప్ప స్వామి వారి రథోత్సవాన్ని పూజలు నిర్వహించి రథోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా మల్డకల్ తిమ్మప్ప స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర)‌ప్రారంభమైనాయి. పేద ప్రజల తిరుపతిగా కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం చేసే తిమ్మప్ప స్వామి జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కలను చెల్లించు కొని స్వామివారి ఆశీస్సులను పొందడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తిమ్మప్ప స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశ్రీశ్రీ తిమ్మప్ప స్వామి వారి ఆశీస్సులతో రైతులందరూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో పాడి పంటల తో‌ కళకళాలడాల ని నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సత్య రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, మాజీ ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు, నాయకులు అజయ్, వెంకటన్న, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్ నర్సింహులు, వెంకటేశ్వర్ రెడ్డి, మధు నాయకి, శేషాద్రి నాయుడు, పరుశురాముడు, ప్రభాకర్, తిమ్మప్ప, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.